Site icon NTV Telugu

ఇలానే కొన‌సాగితే… వాటికి ముప్పు త‌ప్ప‌దా…!!

ఆఫ్రికాలో క‌నిపించే పెద్ద జంతువుల్లో ఏనుగులు కూడా ఒక‌టి. ఆఫ్రికా ఏనుగుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం అంత సుల‌భం కాదు. భారీ ఆకారంతో పెద్ద పెద్ద కోర‌ల‌తో భ‌యంక‌రంగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్లో ఈ ఏనుగులు వ్యాపించి ఉన్నాయి. మోజాంబిక్ దేశంలోని గోరంగొసా జాతీయ పార్క్ లో పెద్ద‌సంఖ్య‌లో ఏనుగుల‌ను సంర‌క్షిస్తున్నారు. ఒక‌ప్పుడు ఈ పార్క్‌లో పెద్ద పెద్ద దంతాల‌తో ఏనుగులు క‌నిపించేవి. అయితే, ఇప్ప‌డుక‌నిపిస్తున్న ఏనుగుల‌కు దంతాలు ఉండ‌టం లేదు. దీనికి పెద్ద కార‌ణ‌మే ఉన్న‌ది. 1977 నుంచి 1992 వ‌ర‌కు ఈ దేశంలో అంత‌ర్యుద్ధం జ‌రిగింది. ఈ యుద్దానికి కావాల్సిన నిధుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డానికి ఏనుగుల దంతాల‌ను సేక‌రించి అమ్మి వ‌చ్చిన డబ్బుల‌ను యుద్ధానికి వినియోగించారు. దీంతో ఆ పార్క్‌లో 90 శాతం ఏనుగులే న‌శించిపోయాయి. ఆ త‌రువాత క్ర‌మంగా మ‌ళ్లీ ఏనుగుల సంఖ్య పెర‌గ‌డం మొద‌లైంది. కానీ, దంతాలు లేని ఆడ ఏనుగుల‌కు పుట్టిన పిల్ల‌లు కూడా దంతాలు ఉండ‌టం లేదు. దీనిపై ప‌రిశోధ‌న‌లు చేసిన శాస్త్ర‌వేత్త‌లు దీనికి కార‌ణాలు క‌నుగొన్నారు. జీన్స్ వ‌ల‌నే ఇదంతా జ‌రుగుతున్న‌ద‌ని, మ‌రికొంత‌కాలం పాటు ఏనుగుల‌న‌కు దంతాలు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దంతాలు లేని ఏనుగులు ఆహారాన్ని సేక‌రించే విధానం వేరుగా ఉంటుంద‌ని, ఇవి ప‌ర్యావ‌ర‌ణంలో భాగ‌స్వామ్యం కాలేవ‌ని, దంతాలు వ‌చ్చిన తిరిగి య‌ధాస్థితికి వ‌చ్చిన త‌రువాత మాత్ర‌మే ఏనుగులు తిరిగి ప‌ర్యావ‌ర‌ణంలో భాగ‌స్వామ్యం అవుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Read: వ్యాక్సిన్ వేయించుకోమంటే…పామును తీసుకొచ్చి భ‌య‌పెట్టారు.. చివ‌ర‌కు…

Exit mobile version