Site icon NTV Telugu

మాజీ మంత్రి ఇంటిపై డీవీఏసీ దాడులు.. ఏకకాలంలో 69 ప్రాంతాల్లో సోదాలు..

తమిళనాడులో డైరెక్టర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటి కరప్షన్‌ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి… ఇవాళ ఉదయం అన్నా డీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి తంగమణి ఇళ్లు, కార్యాలయాలు, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు తమిళనాడు డైరెక్టర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటి కరప్షన్‌ (డీవీఏసీ) అధికారులు.. అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీలలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టినట్టుగా సమాచారం అందుకున్న అధికారులు.. ఇప్పటికే ఆయనపై కేసులు నమోదు చేశారు..

Read Also: ఏపీలో మరో మూడు మెడికల్‌ కాలేజీలు.. కేంద్రం ఆమోదం..

ఇక, ఇవాళ ఏకకాలంలో 69 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.. ఇప్పటి వరకు ఆయన దాదాపు రూ. 5 కోట్ల వరకు క్రిప్టో కరెన్సీలలో ఇన్వెస్ట్‌ చేసినట్లు చెబుతున్నారు.. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దింగిల్, మదురై సహా మొత్తం 69 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.. ఇక, కర్ణాటకలోని ఐదుచోట్ల, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు చోట్ల కూడా సోదాలు చేస్తున్నారు.. ఇప్పటికే కీలమైన డాక్యుమెంట్లు , కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు సీజ్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

Exit mobile version