పుల్లూరు టోల్ గేటు వద్ద మందుబాబులు వీరంగం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ లను సీజ్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే మందుబాబులు తీవ్ర అలజడి రేపారు. టోల్ గేటు వద్ద వాహనాలను అడ్డుకుని వాహనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
రోడ్డు పక్కన వైన్ షాప్ లు ఎందుకు పెట్టారని పోలీసులను ప్రశ్నించారు మందు బాబులు. వైన్ షాప్ దగ్గర ప్రాంతంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనచోదకులపై చేయి చేసుకున్నారు మందుబాబులు