ప్రశాంతతకు నిలయమైన యూరప్ ఖండంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడు పేలిపోతాయో అంచనా వేయడం కష్టమే. స్పెయిన్‌లోని సలా పాల్మాలోని టోడోక్ అనే అగ్ని పర్వతం బద్దలైంది. ఈ పర్వతం నుంచి పెద్ద ఎత్తున పొగ, ధూళితో పాటుగా లావా ఎగసిపడుతున్నది. ఆ అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న లాపార్మాలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే, ఆ గ్రామంలోని కుక్కలను పాఠశాల స్థలంలో తాత్కాలికంగా ఆవాసం కల్పించారు. వీటికి డ్రోన్‌ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడిగాలులకు హెలికాఫ్టర్ లు వెళ్లలేపు. రోటర్లు వేడిగాలికి దెబ్బతింటాయి. దీంతో డ్రోన్లతో ఆహారాన్ని అందిస్తున్నాయి సొల్యూసియోన్స్, వోల్కానిక్ సంస్థలు. సెప్టెంబర్ 19 వ తేదీన కేంబ్రేవీజా అగ్నిపర్వతం పేలినపుడు వందలాది కుక్కలు, ఇతర జంతువులకు అశ్రయం లేకుండా పోవడంతో చాలా కుక్కలు ఆహరం అందక మృతి చెందాయి.
ఊరంతా ఖాళీ… కుక్కలకు డ్రోన్‌లతో ఆహారం…
