2013లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’కు సీక్వెల్ గా ఈ యేడాది ‘దృశ్యం -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేశారు. స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఇలా స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలుగులో ఇప్పటికే వెంకటేశ్ ‘దృశ్యం’ను రీమేక్ చేశారు, ఇప్పుడు ‘దృశ్యం -2’ను జీతు జోసెఫ్ డైరెక్షన్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ తెలుగు రీమేక్ సైతం ఓటీటీలోనే ప్రసారం కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read More: నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్న రకుల్ బికినీ లుక్…!
ఇదిలా ఉంటే… మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన ‘దృశ్యం -2’ మూవీ రేపు గురువారం యు.ఎ.ఇ., ఖతార్, ఒమన్ లోని థియటర్లలో విడుదల కాబోతున్నట్టు తెలిపారు. ఇంతకు ముందు బుల్లితెరలోనూ, స్మార్ట్ ఫోన్ లోనూ ఈ సినిమాను చూసిన ఈ దేశ వాసులు ఎంచక్కా బిగ్ స్క్రీన్ లో ‘దృశ్యం -2’ను చూడొచ్చనే ఆనందకరవార్త ను సోషల్ మీడియా ద్వారా చెప్పారు. మరి ఇండియాలోనూ థియేటర్లు తెరుచుకున్న తర్వాత ‘దృశ్యం -2’ను ఎంపిక చేసిన నగరాల్లో ప్రదర్శిస్తే బాగానే ఉంటుంది. సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి…. వెండితెరపై చూడటానికి కూడా కొందరు ఉత్సాహం చూపించే ఆస్కారం లేకపోలేదు.