NTV Telugu Site icon

డాక్ట‌ర్ కేర్ ఆవార్డు -2021 ప్ర‌ధానోత్సవం

కరోనా కేసులు సమయంలో… సేవలందించిన డాక్టర్ కేర్ వైద్యులకు ఈరోజు డాక్టర్ కేర్ అవార్డు.. ద్వారా వారి సేవలకు గాను ఈ అవార్డు ప్రధానం చేశారు. రెండు వేల మంది పని చేసే డాక్టర్ కేర్ సంస్థలు వంద మంది డాక్టర్లను కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తించి, అలాంటి విపత్కర పరిస్థితులలో వారి కుటుంబాలకు కూడా దూరంగా ఉండి రోగులకు సేవ చేయడం, వారి ధైర్యసాహసాలకు మెచ్చుకుని దాదాపు 100 మంది వైద్యులకు అవార్డు ఇచ్చి ప్రశంస పత్రం ద్వారా వారిని గౌరవించారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన దైవజ్ఞ శర్మ గారు మాట్లాడారు. ఇలాంటి భయంకరమైన వైరస్ విజృంభిస్తున్న అప్పుడు ఈ వైద్యులు వల్లనే సమాజంలో ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి అని… ఇటువంటి వైద్యులు సమాజంలో లేకపోతే మనం ఎవరం జీవించి ఉండేవాళ్ళం కాదన్నారు. డాక్టర్ కేర్ చేస్తున్నటువంటి సేవలకుగాను ఈరోజు ఈ యొక్క డాక్టర్ కేర్ అచీవర్స్ 2021 అవార్డు కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోష దగ్గ విషయం అన్నారు. ఈ అవార్డులు కారణంగా వారి… బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో… డాక్టర్ కేర్ అధినేత డాక్టర్ ఏఏం రెడ్డి గారు పాల్గొని.. అందరికీ అవార్డులు ప్రదానం చేశారు.