Site icon NTV Telugu

Delhi Metro Girl: “డోంట్ కేర్”.. బికినీలో మెట్రో ప్రయాణంపై యువతి ఏం చెప్పిందంటే..

Metro Girl

Metro Girl

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బ్రా, మినీ స్కర్ట్ ధరించి ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చాలా మంది ఆమె బోల్డ్ దుస్తుల ఎంపికలను ప్రశ్నించారు. మరికొందరు ఆమె ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ నుండి ప్రేరణ పొందిందని చెప్పారు. అయితే తాజాగా తనపై వచ్చిన విమర్శలపై సదరు యువతి స్పందించింది. తాను ఏ పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా చేయడం లేదని ఆమె స్పష్టం చేసింది. నెలల తరబడి ఇలా ప్రయాణిస్తున్నానన్నారు. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోనని కూడా ఆ మహిళ చెప్పింది. ”నేను ఏది ధరించాలనుకుంటున్నానో అది నా స్వేచ్ఛ. నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో, పేరు తెచ్చుకోవడం కోసమో ఇలా చేయడం లేదు. ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో నేను పట్టించుకోను” అని ఆమె తెలిపింది. ఉర్ఫీ జావేద్‌ నుంచి తాను స్ఫూర్తి పొందలేదని ఆ మహిళ పేర్కొంది.
Also Read:Setback For Opposition: కేంద్ర సంస్థల దుర్వినియోగంపై విపక్షాలకు ఎదురుదెబ్బ

ఓ మహిళ మెట్రో రైలులో సీటుపై తన ఒడిలో బ్యాక్‌ప్యాక్‌తో కూర్చున్న వీడియో వైరల్‌గా మారింది. ఆమె తన గమ్యస్థాన స్టేషన్‌లో దిగడానికి లేచినప్పుడు, ఆ మహిళ బికినీ ధరించి ఉంది. ఈ వీడియోను తోటి ప్రయాణికుడు తీశాడని సమాచారం. ఆమె వేషధారణ వీడియో వైరల్ కావడంతో, ట్విట్టర్‌లో చాలా మంది ఆమెను “ఢిల్లీ మెట్రో అమ్మాయి” అని పేర్కొన్నారు. సమాజంలో ఆమోదయోగ్యమైన సామాజిక మర్యాదలు, ప్రోటోకాల్‌లను అనుసరించాలని ప్రయాణికులను కోరుతూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర తోటి ప్రయాణీకుల మనోభావాలను కించపరిచే విధంగా ప్రయాణికులు ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదు లేదా ఎలాంటి దుస్తులు ధరించకూడదు అని ప్రకటనలో పేర్కొంది. DMRC యొక్క ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా పేర్కొంది.

Exit mobile version