దీపావళి సందర్భంగా క్రాకర్స్ కి ఎంత హడావిడి వుంటుందో స్వీట్స్ కి కూడా అంతే. బంధు మిత్రులకు స్వీట్స్ పంచుతూ, తియ్య తియ్యని స్వీట్స్ తింటూ సందడి చేస్తారు. హైదరాబాద్ లో కరోనా భయం నుంచి కోలుకుంటోంది.
దీపావళి సందర్భంగా స్వీట్ షాపుల్లో హడావిడి పెరిగింది. అన్ని వర్గాలకు అందుబాటులో వుండే విధంగా జంబో స్వీట్ ప్యాక్ లు అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. బొకేల తరహాలో స్వీట్స్ చేతితో తాకకుండా కరోనా నిబంధనలతో తయారుచేశారు. ఈ స్వీట్లు వినియోగదారుల నోరూరిస్తున్నాయి.