Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Director Kv Reddy Jayanthi Special

చిత్రసీమకు బంగారపు కడ్డి… కేవీ రెడ్డి!

Published Date :July 1, 2021 , 12:58 am
By ramakrishna
చిత్రసీమకు బంగారపు కడ్డి… కేవీ రెడ్డి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

(జూలై 1న కేవీ రెడ్డి జయంతి)

చారిత్రకంతోనే తొలి ఢీ
జానపదాలలో గారడి
పురాణాలతో భలే సందడి
సాంఘికాలలోనూ సవ్వడి
ఇలా చేసిన ఘనుడు కేవీ రెడ్డి! తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో తెలుగు షేక్సిపియర్ గా మారిన కేవీ, ‘పాతాళభైరవి’తో చూపించారు మరింత ఠీవి. ఇక ‘మాయాబజార్’తో చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? ‘చిగురాకులలో చిలకమ్మలకు చిన్నమాటలు వినిపించిందీ’ కేవీగారి ‘దొంగరాముడే’. సమాజంలోని ‘పెద్దమనుషుల’ బాగోతాలు అప్పట్లోనే విప్పి చెప్పిన తెలుగువారి ఇబ్సన్ కూడా ఆయనే!

కొందరు ఏది చేసినా భలే బాగుంటుంది. మరికొందరు ఎన్ని తీసినా చూడలేం. కేవీ రెడ్డి తీసిన చిత్రాల జయాపజయాలను పక్కకు పెడితే, ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అధికశాతం ఆకట్టుకున్నవే! నాటకఫక్కీలో సాగుతున్న తెలుగు సినిమాకు కూడా ఓ సరికొత్త వ్యాకరణం అవసరమని కేవీ భావించారు. అంతకు ముందు మన సినిమాల్లో నాటకఫక్కీనే పలకరించేది. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చినవారే! అయితే వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. ‘జై పాతాళభైరవీ’ అన్నారు కేవీ. అమ్మవారు, ‘నరుడా ఏమి నీ కోరిక’ అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది. అమ్మవారి అనుగ్రహంతో కడదాకా జనం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించారు కేవీ.

‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో ఇద్దరు మేరునగ సమానులైన నటులతో అలరించిన కేవీ రెడ్డి, ఆ తరువాత ఎందుకనో అంతగా ఆకట్టుకోలేక పోయారు. ‘సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము’ వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయిన వారున్నారు. అవి కేవీ తీసిన చిత్రాలే, కానీ, వాటిలో ఆయన ఠీవి కనిపించలేదన్నదే అభిమానుల ఆవేదన. కొందరు కేవీ పని అయిపోయిందన్నారు. మరికొందరు ఆయన గత చిత్రరాజాలనే తలచుకొని పులకించిపోయారు. మళ్ళీ ఏ మాయాబజారునో, లేదా ఏ జగదేకవీరుని కథనో వినిపిస్తారని ఆశించారు. అభిమానులు మాత్రం ఏదో ఒక రోజున కేవీ మునుపటి వైభవం చూపిస్తారనే విశ్వసించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘శ్రీకృష్ణ సత్య’ను తెరకెక్కించారు కేవీ. మళ్ళీ ఆయన ఠీవి నిలచింది. ‘శ్రీకృష్ణ సత్య’నే ఆయన చివరి చిత్రం. విచిత్రమేంటంటే- ‘మాయాబజార్’తో యన్టీఆర్ ను అపరశ్రీకృష్ణునిగా నిలిపిన కేవీ, ఈ తెరకృష్ణుడు నిర్మించిన ‘శ్రీకృష్ణసత్య’తోనే చిత్ర ప్రయాణం ముగించడం! ఏది ఏమైనా విజయంతో మొదలైన కేవీ సినీయానం సక్సెస్ తోనే ముగియడం అభిమానులకు ఆనందం పంచింది. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. అందుకే కేవీ రెడ్డి పేరు ఇంకా ఠీవీగానే చిత్రసీమలో నిలచి ఉందని అంటారు! కాదంటారా!?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director KV Reddy
  • Director KV Reddy Jayanthi Special
  • KV Reddy
  • KV Reddy Jayanthi

తాజావార్తలు

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions