డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి మధుమేహం. అయితే కొత్తగా ఆ వ్యాధి బారిన పడుతున్న వారిలో చాలా మంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి పెరిగిపోతోంది. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: Sruthi Haasan: పెళ్లి చేసుకుందామా అని అడిగిన ఫాన్ కి షాకింగ్ రిప్లై ఇచ్చిన శృతి
జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి డయాబిటిస్ రావడానికి ప్రధాన కారణాలని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. షుగర్ రావడానికి ప్రధానమైన కారణం అధిక బరువు. దీనితోపాటు శారీరక శ్రమ తక్కువగా ఉండడం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం. నిద్ర లేమి వంటి కారణాలు కూడా మధుమేహ వ్యాధికి దారి తీయవచ్చు. శారీరక శ్రమ తగ్గిపోయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ అధిక బరువుకి దారితీస్తున్నది. టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే ఆహార నియమాలు పాటిస్తూ రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయగలిగితే షుగర్ వ్యాధి రాకుండా కట్టడి చేయవచ్చు.
Also Read:Kaala Bhairava: ఎన్టీఆర్-చరణ్ లని మర్చిపోయి ట్రోల్ అయ్యాడు…
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. రక్త పరీక్ష చేయించుకుని షుగర్ మోతాదును చూసుకోవాలి. దీనిని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 మిల్లీ గ్రాముల లోపు ఉంటే షుగర్ వ్యాధి లేనట్టు. వంద నుంచి 139 మిల్లీ గ్రాముల లోపు ఉంటే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నట్టు గుర్తించాలి. 140 మిల్లీ గ్రాములకు మించి ఉంటే డయాబెటిస్ వ్యాధి ఉన్నట్టు. ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారి షుగర్ మోతాదును పరీక్షించుకోగలిగితే షుగర్ వ్యాధిని ముందుగా గుర్తించవచ్చు. తగిన వైద్యం చేయించుకుంటే షుగర్ వ్యాధి వల్ల వచ్చే అనేక అనర్ధాలను అదుపు చేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. జీవన శైలిని మార్చుకోకపోతే, డయాబెటిస్ నియంత్రణ కష్టమేనంటారు. మధుమేహం వృద్ధులకు మాత్రమే వస్తుందనుకోవడం పొరపాటు.ఇది ఏ వయసులో వారికైనా రావచ్చని చెబుతున్నారు.