NTV Telugu Site icon

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న డెల్టా… 90శాతం ఆ వేరియంట్ కేసులే…

ప్ర‌పంచంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది.  క‌రోనా వైర‌స్ అనేక విధాలైన వేరియంట్‌లుగా రూపాంత‌రం చెందుతున్నాయి.  ఇందులో ఆల్ఫా, గామా, బీటా, క‌ప్పా వేరియంట్‌లు ప్ర‌స్తుతం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డం లేదు.  ప్ర‌పంచం మొత్తాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వ‌ణికిస్తోంది.  ప్ర‌పంచంలో న‌మోద‌వుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్ కేసులు ఉండటం విశేషం.  క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు టీకాలు తీసుకుంటున్నా, ఈ వేరియంట్ కేసులు టీకాలు తీసుకోని వారికి, తీసుకున్న వారికి సోకుతున్న‌ది.  185 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు న‌మోద‌వుతున్నాయి.  నిబంధ‌న‌లు పాటించ‌డం ఒక్క‌టే మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయడానికి ఉన్న మార్గం అని, త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ స్ప‌ష్టం చేసింది.  

Read: క‌రోనా ఎఫెక్ట్‌: నెల‌రోజుల‌పాటు ప‌డ‌వ‌లోనే ఒంట‌రిగా ప్ర‌యాణం…