NTV Telugu Site icon

మరింత డేంజర్‌గా డెల్టా వేరియంట్..

Delta variant

Delta variant

కరోనా డెల్టా వేరియంట్‌ మరింత డేంజర్‌గా మారుతోంది. డెల్టా వేరియంట్‌ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లినా సరే.. ఇన్ఫెక్షన్‌ సోకుతుందని తేల్చారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కూడా ఈ వేరియంట్‌ సోకుంది. కరోనా వ్యాప్తి ప్రారంభంలో వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లినప్పటినుంచి ఇన్ఫెక్షన్ బారిన పడటానికి మధ్య సరాసరి ఆరు రోజుల వ్యవధి ఉండేది. కానీ డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. టీకాలు తీసుకున్న వారికి సైతం డెల్టా వేరియంట్ ఒక సవాల్ గా మారిందని వారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు వ్యాక్సిన్ తీసుకున్నామని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా బారిన పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు.