జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. జమ్మూలో 6, కాశ్మీర్‌లో 1 అసెంబ్లీ సిగ్మెంట్‌ను పెంచాలని పునర్విభజన సంఘం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై కాశ్మీర్ పార్టీలు భగ్గుమన్నాయి. జమ్మూలో 6 సిగ్మెంట్లు పెంచాలనే నిర్ణయం బీజేపీకి లబ్ది చేకూర్చే విధంగా ఉందని, జమ్మూలో బీజేపీ బలంగా ఉందని, ఆ పార్టీకి లబ్ది చేయడం కోసమే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జమ్మూతో పాటుగా కాశ్మీర్‌లోనూ సమానంగా అసెంబ్లీ సిగ్మెంట్లు పెంచాలని పునర్విభజన సంఘానికి విజ్ఞప్తి చేశారు.
Read: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్..అమెరికాలో తొలి మరణం నమోదు
2019 ఆగస్ట్ 5 వ తేదీన జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కాశ్మీర్ మొత్తం అట్టుడికి పోయింది. అంతేకాకుండా, జమ్మూకాశ్మీర్‌ను రెండుగా విభజించి లద్ధాఖ్, జమ్మూకాశ్మీర్‌గా రాష్ట్రాలను చేసింది. లద్ధాఖ్ చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతంగా మారితే, జమ్మూకాశ్మీర్‌ను చట్టసభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. త్వరలోనే జమ్మూకాశ్మీర్‌కు తిరగి రాష్ట్రహోదా కల్పిస్తామని కేంద్రం చెబుతున్నది.
