Site icon NTV Telugu

ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం: ఆ వాహనాలు బ్యాన్‌…

ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  జ‌న‌వ‌రి 1, 2022 నాటికి ప‌దేళ్లు పైబ‌డిన డీజిల్ వాహ‌నాల‌ను బ్యాన్ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  ప‌దేళ్లు పైబ‌డిన అన్ని డీజిల్ వాహ‌నాల‌ను ఇక‌పై డీరిజిస్ట‌ర్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.  ఎన్జీటీ ఆదేశాల మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఢిల్లీ స‌ర్కార్ ప్ర‌క‌టించింది.  డీరిజ‌స్ట‌ర్ అయిన డీజిల్ వాహ‌నాల‌కు ఎలాంటి ఎన్ఓసీ జారీచేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.  ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతుండ‌టంతో స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.  ద‌శ‌ల వారీగా కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ప‌దేళ్ల‌కు పైబ‌డిన డిజిల్ వాహ‌నాల‌ను బ్యాన్ చేయాల‌ని నిర్ణ‌యించారు.  

Read: తెలంగాణ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు… చిన్నారుల చేత ప‌నిచేయిస్తే…

అయితే, 15 ఏళ్ల‌కు పైబ‌డిన పెట్రోల్ వాహ‌నాల విష‌యంలో ఇప్ప‌టికే స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోగా, ఇప్పుడు 10 ఏళ్ల‌కు పైబ‌డిన వాహ‌నాల‌పై క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈ వాహ‌నాల‌ను ఢిల్లీ వెలుప‌ల కూడా తిరిగేందుకు ఎన్ఓసీ ఇవ్వ‌బోమ‌ని ఢిల్లీ స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది.  అయితే, కాలం చెల్లిన ఈ వాహ‌నాల‌ను తిరిగి వినియోగించుకోవాలంటే వాటిని ఎల‌క్ట్రిక్ వాహ‌నాలుగా మార్చుకొని వినియోగంలోకి తెచ్చుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.  పాత వాహ‌నాల‌ను ఎల‌క్ట్రిక్ వాహ‌నాలుగా మార్చుకోలేకుంటే వాటిని స్క్రాప్ చేయాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేసింది.  

Exit mobile version