పెగాసస్ స్పైవేర్ వ్యవహారం భారత రాకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది… పార్లమెంట్ ఉభసభలను ఈ వ్యవహారం ఓ కుదుపుకుదిపేసింది.. అయితే.. దీనిపై రక్షణ శాఖ రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది… పెగాసస్ స్పైవేర్‌తో గానీ, దాని తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో గానీ ఎలాంటి లావాదేవీలు జరుపలేదని స్పష్టం చేసింది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. సీపీఎం ఎంపీ డాక్టర్ వి. వివదాసన్ రాజ్యసభలో ఓ ప్రశ్న లేవనెత్తారు.. ఎన్‌ఎస్‌వో గ్రూప్ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఏమైనా లావాదేవీలు జరిపిందా? ఒక వేళ జరిపితే ఆ వివరాలు ఏమిటి? అంటూ ప్రశ్నించారు… దానికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. ఎన్‌ఎస్‌వో గ్రూప్ టెక్నాలజీతో ఎలాంటి లావాదేవీలు జరుపలేదని స్పష్టం చేసింది. కాగా, పెగాసస్ స్పైవేర్ వినియోగం గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా క్యాబినెట్ సెక్రటేరియట్ వంటి ఇతర మంత్రిత్వ శాఖలు ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రకటన చేయని సంగతి విదితమే.
పెగాసస్‌పై రక్షణశాఖ కీలక ప్రకటన
