NTV Telugu Site icon

Amazon Rain Forest Secrets : అమెజాన్ అడవుల్లో ఇన్ని ప్రమాదాలా..!

Amazon Forest

Amazon Forest

మనలో చాలా మంది అమెజాన్ రైన్ ఫారెస్ట్ పేరు వినే ఉంటారు. ప్రపంచంలోనే ది లార్జెస్ట్ ఫారెస్ట్ ఇదే. బేసిక్ గా ఎక్కడైనా దేశంలో అడివి ఉంటుంది. ఇక్కడ మాత్రం అడివిలోనే దేశం.. సారీ దేశాలు ఉన్నాయి. ఒక్క అమెజాన్ రైన్ ఫారెస్ట్ 9 దేశాలలో విస్తరించింది. బ్రెజిల్, పెరు, కొలంబియా, బొలివియా, ఈక్వడార్, ఫ్రెంచ్ గినియా, గినియా, సురినామ్, వెనుజుల. అందులో 60% బ్రెజిల్ లో ఉంది. అమెజాన్ అడవి ఎంత పెద్దదంటే సైజులో మన దేశానికి డబుల్ ఉంటుంది. ప్రపంచంలోనే సెవెంత్ లార్జెస్ట్ కౌంటీ కి డబల్ ఉంటుంది అంటేనే అర్థమవుతుందిగా ఆ అడవి ఎంత ఉంటుందో. అమెజాన్ అడవి 2.3 మిలియన్ స్క్వేర్ కిలో మీటర్స్ అంటే 6 మిలియన్ కిలో మీటర్స్ విస్తీర్ణంలో ఉంది. ఇందులో చాలా తక్కువ శాతం మాత్రమే మనిషి ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. సౌత్ అమెరికాన్ కాంటినెంట్ ఉన్న అమెజాన్ రైన్ ఫారెస్ట్ భూమికి 20% ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే అమెజాన్ రైన్ ఫారెస్ట్ ను ది లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు. ఈ అడవి అసలు ఎలా ఉంటుంది. 20% ఆక్సిజన్ ను భూమికి అందిస్తోంది అంటేనే పూర్తిగా చెట్లతో నిండి ఉంటుంది అని అర్థమవుతుంది. మన దేశానికి డబల్ సైజులో ఉన్న అడవి పూర్తిగా చెట్లతో ఉంది అంటేనే ఎంత డేన్స్ ఫారెస్ట్ అన్న క్లారిటీ వస్తుంది. ఈ అడవి ఎంత డెన్సి ఉంటుంది అంటే ఆ చెట్ల దెబ్బకు కనీసం సన్ లైట్ కూడా నెల పై పడదు. అందుకే ఉదయం పూట కూడా అక్కడ చీకటిగానే ఉంటుంది. అంతే కాదు అమెజాన్ లో వర్షం నీరు భూమిని తాకడానికి 10 నిమిషాలు పడుతుంది.

ఇది భయంకరమైన ప్రాంతం..
ప్రపంచంలో ఎక్కడా లేని అందాలు అమెజాన్ సొంతం. పెద్ద పెద్ద చెట్లు, water falls వాటన్నింటితో పాటు సెకండ్ లాంగెస్ట్ రివర్ ఆన్ ది ఎర్త్.. అమెజాన్ రివర్ ఈ అడవి సొంతం. ఈ నదికి ఏకంగా 1000 కి పైగా ఉపనదులు ఉన్నాయి. 6800 కిమిలు ట్రావెల్ చేసిన తర్వాత అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది అమెజాన్ నది. 2007 లో మార్టిన్ స్ట్రెల్ అనే వ్యతి ఈ నదిని పూర్తిగా ఇదాడు. రోజుకి 10 గంటల చప్పున ఈత కొడితే పూర్తి చేయడానికి 66 రోజులు పట్టింది. ఇది ఎంత భయంకరమైన ప్రాంతం అంటే ఈ నది పైన ఒక్క వంతెన కూడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని అందాలు మాత్రమే కాదు. ఆ అందాల వెనుక ఎన్నో ప్రమాదాలు కూడా అమెజాన్ లో ఉన్నాయి. ఎక్కడా లేని జంతులు, ప్రమాదాలు కూడా అమెజాన్ సొంతం. క్రూర మృగాలు మాత్రమే కాదు విషపూరితమైన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయ్. ముద్దుగా ఉన్నాయని చేపలను పట్టుకుంటారేమో.. పొరబాటున అది పిరాణ అయ్యుంటే మీరు దాని పట్టుకోవడం కాదు అది మిమ్మల్ని పట్టుకుంటుంది జాగ్రత్త. ఇంత అందమైన అడవిలో ఇలాంటి ప్రమాదాలు ఎందుకున్నాయి అని అనుకోవచ్చు. అసలేంటి ఆ ప్రమాదాలు. ఈ రోజు తెలుసుకుందాం.

అమెజోన్ అడవులలో మనుషులకు తెలియని రహస్యాలు..
ఈ వింత ప్రదేశంలో ఎన్నో వింత ప్రాణులు ఉన్నాయ్. ఈ అడవి నుంచి ఎన్నో ఔషదాలు తయారావుతున్నాయ్. ఇప్పుడు మనకు ఉన్న మెడిసిన్స్ లో 20% అమెజాన్ రైన్ ఫారెస్ట్ నుంచి వస్తున్నాయ్. దాదాపు 6 మిలియన్ స్క్వేర్ కిలో మీటర్స్ విస్తీర్ణం ఉన్న అమెజాన్ అడవులలో దాదాపు ప్రతీ రోజు వర్షం పడుతుంది. ఇక్కడ 390 బిలియన్ చెట్లు ఉన్నాయ్. అందులో 16000 రకాల చెట్లు ఉన్నాయ్. అంతే కాకుండా 427 జాతుల మ్యామల్స్, 1300 జాతుల పక్షులు, 378 జాతుల రెప్టైల్స్, 400 జాతుల యాంఫీబియన్స్ ఉన్నాయ్. వాటిలో ఇక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించని ప్రాణులు కొన్ని ఉన్నాయ్. ఈ అడవికి ప్రతీ సంవత్సరం 22 వేల టన్నుల దుమ్ము సహారా ఎడారి నుంచి ఎగిరి వస్తుంది. ఆ దుమ్ములో ఉన్న ఫాస్ఫరస్ వల్లే ఇక్కడి చెట్లకు మంచి పోషణ దొరుకుతుంది. మరి ఇన్ని మంచి విషయాలు ఉన్న చోట ప్రమాదం ఏంటి అనుకుంటున్నారా..? అమజోన్ అడవులలో మనుషులకు తెలియని రహస్యాలు, ప్రమాదాలు ఎన్నో ఉన్నాయ్. ఇక్కడికి ఒకసారి వస్తే ఆ మనిషి మళ్ళీ తిరిగి ఇంటికి వెళతాడాని గ్యారెంటీ లేదు.

17 రకాల హైలీ వెనమస్ స్నేక్స్ ..
అమెజాన్ రైన్ ఫారెస్ట్. భూమిపై ఎక్కడా లేని క్రూర జంతువులు, పక్షులు, విషపూరిత మొక్కలు, మనుషులను సైతం తినే పురాణ చేపలు ఈ అడవి సొంతం. బేసిక్ గా అడవి అనగానే మనకు ముందుగా పులులు, సింహాలు గుర్తుకు వస్తాయ్. ఎందుకంటే మన ఫుడ్ చైన్ కి టాప్ లో ఇవే ఉంటాయి కాబట్టి. అయితే అమెజాన్ లో పులులు, సింహాలు ఉండవు. పూలు సింహాలే కాదు ఇక్కడ ఏనుగులు కూడా ఉండవు. ఎందుకంటే సింహాలు, ఏనుగులు ఉండాలంటే వాటికి సవాన కావాలి. ఈ రెండు జంతువులూ డెన్స్ ఫారెస్ట్ లో ఉండలేవు. సో, ఈ అడవిలో మనకు పూలు, సింహాలు, ఏనుగులు వంటి జంతువులూ కనిపించవు. ఇవి మాత్రమే కాదు మన దేశ అడవుల్లో ఉండే చాలా జాతులు ఇక్కడ కనిపించవు. ఇక్కడ అనకొండ, జాగ్వర్, పుమా, బ్లాక్ కైమన్స్, స్పైడర్ మంకీస్, బులెట్ యాంట్స్, ఎలక్ట్రిక్ ఎల్, పురాణాల కనిపిస్తాయి. వీటితోపాటు 17 రకాల హైలీ వెనమస్ స్నేక్స్ ఇక్కడ ఉంటాయి. అంతే కాకుండా అమెజాన్ నదిలో బుల్ షార్క్స్ కూడా కనిపిస్తాయి. అదేంటి షార్క్స్ సముద్రాల్లో ఉంటాయి కదా ఫ్రెష్ వాటర్ లో సర్వైవ్ అవ్వలేవు అనుకుంటే.. థాట్స్ ఆ మిస్టేక్. ఫ్రెష్ వాటర్ లో సర్వైవ్ అవ్వగల అతితక్కువ షార్క్స్ లో ఒకటి బుల్ షార్క్స్. ఇన్ని ఆపదల మధ్య అక్కడి జంతువులూ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ బ్రతుకుతుంటాయి. అక్కడి జంతువుల పరిస్థితే ఇలా ఉంటె. మరి మనుషులు అక్కడికెళితే ఏంటి పరిస్థితి..?

మనుషులు అక్కడికెళితే ఏంటి పరిస్థితి..?
మనం అనకొండ లను చాలా సినిమాల్లో చూసి ఉంటాం. కరెక్ట్ గా చెప్పాలంటే 1997 లో వచ్చిన అనకొండ సినిమా నుంచి ఈ పేరు బాగా పాపులర్ అయ్యింది. సో, ఈ అనకాండలు కనిపించే ఏకైక ప్రాంతం ఏదంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ అనకొండలలో 4 స్పీసీస్ ఉన్నాయి. బొలీవియాన్ అనకొండ, ఎల్లో అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ అండ్ ది గ్రీన్ అనకొండ. వీటిలో అన్నింటికంటే పెద్దది అండ్ ప్రమాదకరమైనది గ్రీన్ అనకొండ. వీటిలో మేల్ అనకొండ 9 అడుగులు ఉంటె ఫిమేల్ అనకొండ 16 అడుగుల వరకు ఉంటుంది. కరెక్ట్ గానే విన్నారు వీటిలో మేల్ కంటే ఫిమేలే పెద్దగా ఉంటుంది. అంతే కాదు మేటింగ్ సమయంలో మేల్ అనకాండను ఫిమేల్ చంపి తినేస్తుంది. మగ అనకాండల పరిస్థితే ఇలా ఉంటె మరి దానికి మనం దొరికితే పరిస్థితి ఏంటి..? ఇక్కడ ఫుడ్ చైన్ టాపర్ గా ఉన్న అనకొండకు కూడా ప్రమాదాలు ఉన్నాయి. బేసిక్ గా అనకాండలు చిన్నగా ఉన్నప్పుడు వాటికి జాగ్వర్స్, కైమన్స్, పిరాణస్ నుంచి ముప్పు ఉంటుంది. బేబీ అనకొండ ఎప్పుడో దొరుకుతుందా అని వెయిట్ చేతుంటాయ్ ఈ జంతువులూ. అలా చాలా వరకు అనకాండలు చిన్న వయసులో ఉన్నప్పుడే వీటి బారినపడి చనిపోతాయి. మిగతా అనకాండలు ఆ తర్వాత ఫుడ్ చైన్ లో టాపర్ గా నిలుస్తాయి.

క్రూరమైన జంతువు జాగ్వర్ ఇక్కడే ఉంది…
ఇక ఇక్కడ ఉండే మరో క్రూరమైన జంతువు జాగ్వర్. ప్రపంచంలో జాగ్వర్ కేవలం 18 దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అందులో 9 దేశాలు అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోనే ఉన్నాయి. అనకొండ తో పాటు ఫుడ్ చైన్ లో టాపర్ గా ఉన్న మరో జంతువు జాగ్వర్. భూమిపైన అడల్ట్ అనకాండను చంప గల ఏకైక జంతువూ ఏదైనా ఉంది అంటే అది జాగ్వర్ మాత్రమే. చూడటానికి పులి కంటే చిన్నగా ఉన్నా జాగ్వర్ చాలా బలమైనది. దాని బైట్ ఫోర్స్ పులి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. టైగర్ బైట్ ఫోర్స్ 1050 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ అయితే జాగ్వర్ బైట్ ఫోర్స్ 1500 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఉంటుంది. బేసిక్ గా నీటిలో మొసలిని ఎవరూ ఏమీ చేయలేరు అంటారు. కానీ నీటిలోకి వెళ్లి మొసలిని చంపగల శక్తి జాగ్వర్ సొంతం. మరో పక్క బ్లాక్ కైమన్స్. ఇవి అమెజాన్ నదిలో మాత్రమే కనిపించే మొసళ్ళు. ఇవి కూడా చాలా భయంకరమైనవి. మీడియం సైజు అనకాండను ఈజీగా చంపగల జంతువులూ బ్లాక్ సైమన్స్. వీటితో పాటు ఇదే నదిలో కనిపించే బుల్ షార్క్స్ ఆ అడవిని మిగతా ప్రాణులను హెల్ ఆన్ ది ఎర్త్ గా మారుస్తాయి. అంతేనా విషపూరితమైన సర్పాలు. అమెజాన్ అడవుల్లో ఏకంగా 17 రకాల వెనమ్స్ స్నేక్స్ ఉన్నాయి. వెనమస్ స్నేక్స్ మాత్రమే కాదు Brazilian Wandering Spider వంటి వెనమస్ స్పైడర్స్ కూడా ఈ అడవిలో కనిపిస్తాయి. తమ కరెంటు షాక్ తో చంపగల ఎలక్ట్రిక్ ఈల్స్, మానుషలును సైతం చంపేయగల పురాణ చేపలు, బుల్లెట్య్ యాంట్స్ వంటి చీమలు అమెజాన్ ఉన్నాయి. వీటితో పాటు విషపూరితమైన చెట్లు, మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి. చెట్టు బాగుందని దాని పండు తిన్నా.. మొక్క బాగుందని దానికున్న పువ్వును వాసనా చూసిన మళ్ళీ ఇంటికి వస్తామో లేదో డౌటే. ఇక్కడ అడుగడుగునా ప్రమాదమే.

ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనిషుల జీవనం..
ఇక ఇక్కడి మనుషుల గురించి మాట్లాడితే ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనుషు బ్రతుకుతున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్న కొన్ని జాతులను క్యానిబల్స్ అంటారు. కానీ ఇక్కడ క్యానిబల్స్ ఉన్నట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇక్కడ దాదాపు 350 జాతులకు సంబంధించిన 40 మిలియన్ ల మంది నివసిస్తున్నారు. వీరికి ఈ అడవులు అంటే ప్రాణం. వీరు ఇక్కడ తప్ప బయట బ్రతకాలేరు. ఇక్కడ చాలామందికి బయట మరో ప్రపంచం ఉంది అన్న విషయం కూడా తెలియదు. అయితే 1960 వరకు ఇక్కడికి బయటవారికి అనుమతి లేదు. కానీ ఆ తర్వాత అగ్రికల్చర్ కోసం మొదటి సారి ఇక్కడ డీ ఫారెస్ట్రేషన్ చేఅశృ. ఆ తర్వాత ఎదో ఒక పేరుతో ఇక్కడ ఇలా జరుగుతూనే ఉంది. ఈ డీ ఫారెస్ట్రేషన్ ల వల్ల అమెజాన్ తన ఉనికిని కొలపోతోంది. సాటిలైట్ ఇమేజెస్ లో చూస్తే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ప్రపంచానికి 20% ఆక్సిజన్ ను ఇచ్చే అడవిని ఇలా నాశనం చేసుకుంటూ పోతే ఫ్యూచర్ లో గాలి పీల్చడానికి కూడా డబ్బులు కట్టాల్సివస్తుంది.

 

 

Show comments