ప్రపంచంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గ్లోబలైజేషన్ కారణంగా ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. వేగంగా ప్రయాణాలు చేయడం కోసం విమానాలు ఎక్కేస్తున్నారు. ఎయిర్‌పోర్టుల వినియోగం పెరిగిపోతున్నది. కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నది. అయితే, విమానాశ్రయాలను అన్ని ప్రాంతాల్లో నిర్మించడం కుదరని పని. రన్‌వే ఉండాలి. విమానాశ్రయానికి దగ్గరగా పెద్ద పెద్ద బిల్డింగులు ఉండకూడదు. కొన్ని చోట్ల నిర్మించే ఎయిర్‌పోర్ట్‌లు అందర్ని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి న్యూజిలాండ్‌లోని గిస్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే కు అడ్డంగా రైల్వే ట్రాక్ ఉన్నది. ఈ ట్రాక్ మీద నుంచి రైళ్లు నడుస్తుంటాయి. రన్‌వే మీద నుంచి విమానాలు రాకపోకలు చేస్తుంటాయి. రెండింటి మధ్య సమన్వయంతో ఎయిర్‌పోర్ట్ ను రన్ చేస్తున్నారు. రైలు వెళ్లే సమయంలో విమానాలను అపేస్తారు. విమానాలు రన్‌వే దిగే సమయంలో రైలును నిలిపివేస్తారు. న్యూజిలాండ్‌లోనే వెల్లింగ్టన్‌లో సముద్రం పక్కనే మరో విమానాశ్రయం ఉన్నది. సముద్రం నుంచి హోరు గాలి వీస్తుంటుంది. దీంతో ఈ విమానాశ్రయంలో విమానాలను ల్యాండింగ్ చేయడం పైలట్లకు పెద్ద సవాల్‌గా మారుతుంది.
ఇలాంటి రన్‌వే మీరెక్కడా చూసుండరూ…
