ఏ వీడియోలు ఎప్పుడు ఎలా వైరల్ అవుతాయో చెప్పలేము. చిన్న చిన్న విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. పెద్దపెద్దగా చిరాకు పెట్టే విధంగా అరిస్తే అరె కాకిలాగా అరుస్తావెందుకురా అని తిడుతుంటారు. కాకి పేరుతో చాలా మంది చాలా రకాలుగా సంబోదిస్తుంటారు. కాకుల్లో తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది.
Read: వైరల్: వీడి టాలెంట్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే…
నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసిన కథలు చిన్నప్పుడు చాలా చదువుకొని ఉన్నాం. తెలివైన కాకుల్లో కొన్ని కాకులు వేరుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. కాకులు నడిచే విధానం దారుణంగా ఉంటుంది. కాని, ఈ కాకి నడక చూస్తే మాత్రం ఎవరైనా సరే ఫిధా కావాల్సిందే. దీని నడక ముందు ర్యాంప్ వాక్‌పై క్యాట్ వాక్ చేసే మోడళ్లు కూడా దిగదుడుపే. అంత క్యూట్‌గా వాక్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది.