అక్కడ శీతాకాలం వచ్చింది అంటే రోడ్లపైకి ఎర్రపీతలు వస్తుంటాయి. ఒకటి కాదు రెండు కాదు వేలాది సంఖ్యలో చిన్నచిన్న పీతలు రోడ్లమీదకు వస్తుంటాయి. రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్లమీదకి పీతలు చేరుతుంటాయి. దీంతో ఈ పీతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఒకటి కాదు, రెండు కాదు కోట్లాది పీతలు ఇలా ఇళ్లమీదకు రావడంతో ప్రజలు డోర్లు మూసేసి ఇండ్లల్లోనే ఉండిపోతుంటారు. అధికారులు రోడ్లను సైతం మూసేస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు అన్నిచోట్ల కనిపించవు.
Read: బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు
వీటిని చూడాలి అంటే ఆస్ట్రేలియాలోని క్రిస్‌మస్ ఐలాండ్ కు వెళ్లాల్సిందే. ప్రతి ఏడాది క్రిస్మస్ ఐలాండ్ లోని అడవుల్లో నుంచి వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని నేషలన్ పార్క్ వైపు వెళ్తుంటాయి. కొన్నేళ్ల క్రితం వేలల్లో పీతలు ఇలా వలస వెళ్లేవి. కానీ ఇప్పుడు సుమారు 5 కోట్ల పీతలు ఇలా వలస వెళ్లడం ఆశ్చర్యం కలుగుతుందని టూరిస్టులు చెబుతున్నారు. అడవుల్లో వర్షాలు కురవడం ఆగిపోయాక పీతలు అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో ఇవి వలస వెళ్తుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.