బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ జాతిని ఉద్దేశించి… ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంగించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు.

రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ప్రధాని మోడీ చేసిన.. తాజాగా ప్రకటన పై దేశ వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles