“చిన్నారి పెళ్లికూతురు” సీరియల్ లో ప్రధాన పాత్రతో చిన్నప్పుడే సెలెబ్రిటీ స్టేటస్ ను అందుకుంది అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన క్యూట్ పర్ఫార్మన్స్ తో అందరినీ కట్టిపడేసింది. 2013లో “ఉయ్యాల జంపాల” చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం భారీ హిట్ కావడమే కాకుండా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆమె వరుస పరాజయాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే తాజాగా అవికా గోర్ ట్రాన్స్ఫార్మేషన్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అంతలా మారిపోయింది ఈ అమ్మడు. అయితే ఆ క్రెడిట్ మొత్తం తన ప్రియుడిదే అని అంటోంది.
Read Also : శేఖర్ కమ్ముల, ధనుష్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇదే…?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవికా మాట్లాడుతూ “మిలింద్, నేను హైదరాబాద్లోని కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాము. మేము గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాము. నా శారీరక, మానసిక, భావోద్వేగ పరివర్తనకు కారణం మిలింద్. ఆ క్రెడిట్ మిలింద్ దే. ఎందుకంటే అతను నాకు ఎదగడానికి సహాయం చేశాడు. నా గురించి చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి నాకు సహాయపడ్డాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ న్యూ మేకోవర్ తరువాత తనకు “ఉయ్యాల జంపాల” వంటి ఆఫర్లు కాకుండా సరికొత్త ఆఫర్లు వస్తున్నాయని, ఈ కష్ట సమయంలో తనకు ఇలాంటి ప్రేమ దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. 23 ఏళ్ల ఈ నటి, హైదరాబాద్‌కు చెందిన మిలింద్ చాంద్వానీ అనే కార్యకర్తతో లవ్ లో ఉన్నట్టు గతంలోనే వెల్లడించింది. ఇక అవికా ఇప్పుడు ఆది సాయికుమార్ సరసన “అమరన్”లో, ఇంకా టైటిల్ ఖరారు కాని నవీన్ చంద్ర, కళ్యాణ్ దేవ్ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న నాగ చైతన్య “థాంక్స్”లో కూడా అవికా కీలక పాత్ర పోషిస్తోంది.