కరోనా మహమ్మారి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా, వ్యాక్సిన్ వేసుకుంటున్నా, కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రపంచ దేశాల్లోని ప్రజలు నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీనిపై కేంబ్రిడ్జి పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, రెండు మీటర్ల దూరం సోషల్ డిస్టెన్స్ పాటించినంత మాత్రాన సరిపోదని, గాలి తుంపరలో వైరస్ సుమారు మూడు మీటర్ల దూరం వరకు ప్రయాణం చేయగలుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. తుమ్మినా, దగ్గినా గాలి తుంపరల్లో వైరస్ మూడు మీటర్ల దూరం వరకు ప్రయాణం చేస్తుందని, అందుకే కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
Read: ‘అఖండ’ ప్లాన్ రివర్స్… బాలయ్యే కారణం అంటున్న నిర్మాత
ఇక యూరప్ దేశాల్లో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్నది. కేసులతో పాటుగా మరణాలు పెరుగుతున్నాయి. శీతాకాలంలో సుమారు 7 లక్షల మంది మరణించే అవకాశం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ను అమలుచేశారు. అయితే దీనికి భిన్నంగా ఆఫ్రికా దేశాల్లో తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిజేసింది.
