‘అఖండ’ ప్లాన్ రివర్స్… బాలయ్యే కారణం అంటున్న నిర్మాత

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ’ డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ‘అఖండ’ కోసం ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అయ్యాయట. తాజా మీడియా ఇంటరాక్షన్‌లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ‘అఖండ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సింపుల్‌గా జరగబోతున్నట్లు వెల్లడించారు.

Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి!

“మేము మొదట ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసాము. అయితే ఇప్పుడు బాలయ్య గారి చేతికి సర్జరీ కారణంగా సింపుల్‌గా ఈ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం’’ అని నిర్మాత వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ‘అఖండ’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనతో రవీందర్ రెడ్డి ఉత్సాహంగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఈ సినిమా ప్రీమియర్ షోల టిక్కెట్లు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని ఆయన వెల్లడించారు.

Related Articles

Latest Articles