దసరా పండుగను అంతా ఘనంగా సెలబ్రేట్ చేస్తే.. ఏపీలోని ఓ ప్రాంతంలో మాత్రం కర్రల సమరం జరుగుతోంది.. కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం నిర్వహిస్తున్నారు.. అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.. ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి ఊర్లకు ఊర్లే తలపడతాయి.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. ఈ ఉత్సవంలో పాల్గొంటారు.. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆ మూర్తుల కోసం కర్రలతో తలపడతారు. వందల సంఖ్యలో ప్రజలు ఈ కర్రల యుద్దంలో పాల్గొంటారు. చాలా మంది గాయాలపాలైన ఘటనలు ఎన్నో..
also read: గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి – FUN88.com
అయితే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. కర్రల సమరంపై ఆంక్షలు విధించారు అధికారులు.. దేవరగట్టులో బన్నీ ఉత్సవానికి స్థానికులు సిద్ధం అవుతుండగా.. కర్రల సమరంలో హింస జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 164 మంది ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 322 మంది కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా పోలీసులు, మూడు ప్లాటూన్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది, 200 మంది హోమ్ గార్డులను ఈ బందోబస్తుకు కేటాయించారు.. అంతే.. ఇక, కరోనా నేపథ్యంలో ఆంక్షలు విధించారు పోలీసులు.. ఒక్కో గ్రామం నుంచి 150 మందికే అనుమతి ఇచ్చారు. దీంతో.. బన్సీ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడానికి అవకాశం లేకుండా పోయింది.. కొత్త నిబంధనలతో హింస కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.