Site icon NTV Telugu

ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టునుంచి వైఎస్ ష‌ర్మిల‌కు ఊర‌ట‌…

జగన్ తల్లి వైయస్ విజయమ్మ సోదరి,  షర్మిల ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఊరట లభించింది.  2012లో పరాకల లో ఏర్పాటు చేసిన సభకు అనుమతికి సంబంధించిన కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభ ఏర్పాటు చేశారన్న అభియోగాలపై షర్మిల, విజయమ్మపై అప్పుడు కేసు నమోదయింది.  ఈ కేసుకు  సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కొండా సురేఖ కొండా మురళి తో పాటుగా తొమ్మిది మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.  పోలీసులు మోపిన అభియోగాలపై ప్రజాప్రతినిధుల కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి.  దీనిలో పోలీసులు సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచకపోవడంతో కేసును కొట్టివేసింది. కొండా సురేఖ, కొండా మురళి సహా తొమ్మిది మందిపై పెట్టిన కేసుల‌ను కోట్టివేసింది కోర్టు.  
-Ramesh Vaitla

Read: షాపై దిగ్విజ‌య్ ప్ర‌శంస‌లు… ఆ సహాయం ఎప్ప‌టికి మ‌ర్చిపోను..

Exit mobile version