Site icon NTV Telugu

శిల్ప‌కు బిగ్ షాక్‌..బెయిల్ నిరాక‌రించిన కోర్టు

పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట ప్రముఖల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసిన కేసులో శిల్ప చౌద‌రిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. శిల్ప చౌద‌రి కేసులో ఊహించ‌ని షాక్ త‌గిలింది. శిల్ప చౌద‌రి కి బెయిల్ నిరాక‌రించి.. రిమాండ్ విధించింది ఉప్పర్ పల్లి కోర్టు. ఈ కేసులో 2 రోజుల పాటు ఎక్సటెన్షన్ కస్టడీ కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు.

అదే స‌మయంలో… శిల్ప చౌద‌రి కూడా బెయిల్ పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలోనే.. ఒక్క రోజు కస్టడీ కి అనుమతి ఇచ్చింది ఉప్పర్ పల్లి కోర్టు. అటు శిల్ప చౌద‌రి కి బెయిల్ నిరాక‌రించింది కోర్టు. అనంత‌రం… చంచల్ గూడ మహిళ జైలుకు తరలించాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు..శిల్ప చౌద‌రిని చంచల్ గూడ మహిళ జైలుకు తరలించారు.

Exit mobile version