NTV Telugu Site icon

ఖ‌రీదైన టూర్‌: 12 రోజుల ప్ర‌యాణానికి రూ. 600 కోట్లు ఖ‌ర్చు…

కొన్ని ప్ర‌యాణాలు చాలా ఖ‌రీదైన‌వి.  అలాంటి ప్ర‌యాణాల్లో ఇదికూడా ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు.  అంత‌రిక్ష రంగంలో అనేక ప్రైవేట్ కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి.  అంత‌రిక్షంలోకి మ‌నుషుల‌ను తీసుకెళ్లేందుకు ప్ర‌త్యేకంగా రాకెట్లు, స్టార్‌షిప్ వంటి వాటిని త‌యారు చేస్తున్నారు.  అంత‌రిక్ష రంగం క‌మ‌ర్షియ‌ల్‌గా లాభ‌సాటిగా మారింది.  ప్రపంచ కుబేరులు అంత‌రిక్షంలో ప్ర‌యాణం చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.  అలాంటి వారిలో జ‌పాన్‌కు చెందిన మెజువా కూడా ఒక‌రు.  

Read: ఒమిక్రాన్ దెబ్బ‌కు మ‌రో అంత‌ర్జాతీయ స‌మావేశం వాయిదా…

మెజువా డిసెంబ‌ర్ 8 వ తేదీన ర‌ష్యా కాస్మోనాట్ మిసుర్కిన్ తో క‌లిసి సూయజ్ రాకెట్ ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లారు.  ఇంట‌ర్నేష‌న్ స్పేస్ స్టేష‌న్‌లో 12 రోజుల‌పాటు ఉన్నారు. 12 రోజుల అనంత‌రం ఈయ‌న, ర‌ష్యాకాస్మోనాట్ మిసుర్కిన్ మ‌రోక‌రు క‌లిసి భూమిమిద‌కు సుర‌క్షింగా ల్యాండ్ అయ్యారు.  12 రోజుపాటు జ‌రిగిన ఈ ప్ర‌యాణం కోసం మెజువా రూ. 600 కోట్లు ఖ‌ర్చుచేశారు.  2023లో డియ‌ర్ మూన్ ప్రాజెక్టులో భాగంగా మెజువా చంద్రుని మీద‌కు వెళ్ల‌బుతోన్నారు.  ఎల‌న్ మ‌స్క్ కు చెందిన స్టార్ షిప్ ద్వారా ఆయ‌న చంద్రునిమీద‌కు వెళ్ల‌బోతున్నారు.  దీనికోసం భారీగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు మెజువా ప్ర‌క‌టించారు.