Site icon NTV Telugu

కరోనా ఎఫెక్ట్.. కాంతుల్లేని దీపావళి

పిండివంటలు, స్వీట్లు ప్రతి పండుగలోనూ కనిపిస్తాయి. కానీ దీపావళి సమ్‌ థింగ్ స్పెషల్ పండుగ. ప్రజలకు వెలుగుల పండుగ కాగా వ్యాపారులకు కాసులు కురిపించే పండగ. ప్రతి ఇంటి ముందూ విరజిమ్మే టపాసుల వెలుగులు తగ్గనుందా..? అన్న ఆందోళనలో ప్రజలు వున్నారు.

టపాసుల అమ్మకం కోసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా? రాదా? అనే ఆందోళనలో వ్యాపారులు ఉన్నారు. మార్కెట్లో టపాసుల కొరత తీవ్రంగా వుంది. లాక్ డౌన్ లో ఉత్పత్తి లేకపోవడం… శివకాశీలో ప్రమాదం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి టపాసులు అంతగా కనిపించడం లేదు. రెట్టింపు ఇన్వెస్టిమెంట్ పెట్టినా.. స్టాక్ దొరకడం లేదు అంటున్నారు వ్యాపారులు. లాక్ డౌన్ వల్ల షాపులకు జనం రావడం లేదంటున్నారు. యువత ఎక్కువగా కొనుగోలు చేసే 10 థౌసండ్ వాలా, 5 థౌసండ్ వాలాలు దొరకడం లేదు. గతేడాది కంటే 10 నుంచి 20 శాతం ధరలు పెరిగాయి. గత రెండురోజులుగా ధరల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

దీపావళి క్రాకర్స్ ధరలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో దీపావళి కాంతులు పెద్దగా కనిపించడం లేదు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండురోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి ముసురు వాతావరణం ఉన్నా, వర్షాలు పడుతున్నా టపాసులు పేలడం కష్టం. దీంతో ఈ సంవత్సరం అమ్మకాలు ఏ విధంగా ఉంటాయోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.ఏపీ అంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి శివకాశి, చెన్నై, పర్లాకిమిడి నుంచి టపాసులను తెప్పించిన వ్యాపారులకు వాతావరణం కలవరపాటుకు గురవుతున్నారు. దీపావళి పండగకు వారం పది రోజుల ముందు నుంచే టపాసుల మోత వినిపించేది. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి మారిపోయింది. ప్రతి సంవత్సరమూ వీటి ధరలు పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ఇందుకు కారణమని చెప్పొచ్చు.

గతంలో రూ.500లు ఖర్చు పెడితే ఒక మోస్తరుగా టపాసులు వచ్చేవి. ఈ ఏడాది ధరలు రెట్టింపు కావడంతో కొద్దిపాటి టపాసులు కావాలన్నా కనీసం రూ.1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో టపాసుల సంగతి అలా ఉంచితే కొవ్వొత్తులతోనే సరిపెట్టుకుందామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మరోవైపు గ్రీన్‌ టపాసులనే ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.

Exit mobile version