Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి కాంటాక్టులో 5గురికి కరోనా

కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చి మరోసారి అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ తాజాగా భారత్‌లోకి కూడా ప్రవేశించింది. అయితే నవంబర్‌ 11న ఓ 66ఏళ్ల వ్యక్తి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు, నవంబర్‌ 20న 46 ఏళ్ల మరో వ్యక్తి కూడా బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.

అయితే అందరికీ చేసినట్లుగానే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిద్దరికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్థారణైంది. అయితే తాజాగా వీరి కాంటాక్టు లిస్టులో ఉన్న వారికిసైతం వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 ఏళ్ల వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులో 5 గురికి కరోనా నిర్థారణైంది. అయితే వీరి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కరోనా సోకిన ఈ 5గురిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.

Exit mobile version