Congress Party President: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టకపోతే ఎవరికి ఛాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Party President: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ప్రక్రియ పూర్తికావాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి(మూడేళ్లుగా) సోనియా గాంధే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతారా లేక మరెవరైనా తెర మీదికి వస్తారా అనేది అర్థంకావట్లేదు.
పార్టీ చీఫ్‌గా మరోసారి వ్యవహరించేందుకు రాహుల్ గాంధీ ఏమాత్రం ఆసక్తి చూపట్లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పదవి నుంచి వైదొలిగినప్పుడే ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఇంకోసారి పగ్గాలు చేపట్టబోమని తేల్చిచెప్పారు. కానీ రాహుల్ గాంధీ అలా అన్న కొద్ది రోజులకే ఆయన తల్లి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలను స్వీకరించారు.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Priyanka Gandhi Vadra: ప్రియాంకా గాంధీకి కోవిడ్… రాహుల్ గాంధీకి అనారోగ్యం
కాబట్టి ఇప్పుడు కూడా చివరి నిమిషం దాక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదని గాంధీ కుటుంబ సన్నిహితులు సైతం పేర్కొంటున్నారు. భారత్ జోడో యాత్రను లీడ్ చేస్తానని చెబుతున్న రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్‌గా మాత్రం ఉండబోనని పదే పదే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష పదవి అధిరోహించాలని కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.
సోనియా గాంధీ తాత్కాతిక అధ్యక్షురాలు కాకముందే రికార్డ్ స్థాయిలో 20 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏడాదిన్నరకు పైగా అధ్యక్షుడిగా పార్టీని నడిపారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ (నలుగురి) మొత్తం పదవీ కాలంతో పోల్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే (ఇద్దరే) ఎక్కువ కాలం ప్రెసిడెంట్ పోస్టులో ఉండటం గమనార్హం.
అయినప్పటికీ మరోసారి గాంధీ కుటుంబీకులే (ప్రియాంక గాంధీ వాద్రా సహా ఎవరైనా ఒకరు) అధ్యక్ష హోదాలో ఉండాలని విజ్ఞప్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉన్నారు. ఒక వైపు అధికార పార్టీ బీజేపీ నేతలు వారసత్వ, కుటుంబ రాజకీయాల పేరుతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. మరో వైపు 2024 జనరల్ ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. దీంతో గాంధీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు అధ్యక్ష కుర్చీలో కూర్చోకపోతే కష్టమని కేడర్ మొత్తం భావిస్తోంది.
రాహుల్ గాంధీ ససేమిరా అంటుండటంతో ఆయన కుటుంబానికి సన్నిహితంగా, విధేయులుగా ఉండే కొందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న పలువురి పేర్లు, సామాజికంగా వెనకబడ్డ వర్గాల్లోని కొందరు నాయకుల పేర్లు పార్టీ అధ్యక్ష పదవికి అడపాదడపా వినిపిస్తున్నాయి. కానీ అవి వాస్తవ రూపం దాల్చే సూచనలు కనిపించట్లేదంటూ రాజకీయ పరిశీలకులు కొట్టిపారేస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఆఖరి నిమిషంలోనూ ఒప్పుకోకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్ మరింత ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?