హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున వెలువడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో అందరికంటే భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 3012 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకొవచ్చు. 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60,604 ఓట్లు సాధించింది.
Read: దీపావళి ధమాకా: వినియోగదారులకు పుత్తడి షాక్…
మొత్తం 306 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహించగా, 172 కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం సింగిల్ డిజిట్ ఓట్లు మాత్రమే వచ్చాయి. 134 కేంద్రాల్లో 10 ఓట్ల కంటె ఎక్కువ ఓట్లు పడగా, 71,72,107,281 పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. కాగా, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై పార్టీ ఈరోజు సమీక్షను నిర్వహించబోతున్నది. ఈ సమీక్షాసమావేశంలో ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నారు.