Site icon NTV Telugu

మెంటార్ గా ధోని నియామకం పై బీసీసీఐకి ఫిర్యాదు…

యూఏఈ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని నియమించింది బీసీసీఐ. యతే భారత జట్టు మెంటార్‌గా ధోనీ నియామకంపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. ధోనీ నియామకం లోధా కమిటీ సంస్కరణలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ నిబంధనల ప్రకారం, ఒకే వ్యక్తి రెండు పదవుల్లో కొనసాగడానికి వీల్లేదని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. దీంతో అతన్ని టీమిండియా మెంటార్‌గా నియమించడం చెల్లదని సంజీవ్ గుప్తా వాదించారు. ఈ మేరకు ఆయన బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. చూడాలి మరి ఈ ఫిర్యాదు పై బీసీసీఐ ఎలా స్పందిస్తుంది అనేది.

Exit mobile version