Site icon NTV Telugu

తమిళ సీఎం స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనతో సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌, కుటుంబ‌స‌భ్యుల‌తో స్టాలిన్ ఇంటికి వెళ్ళారు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర కూటమి ఏర్పాటుపై చ‌ర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌‌ను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు సీఎం కేసీఆర్‌ వెళ్ళారు.

సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు ఆయన సతీమణి కె.శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతో్‌షకుమార్‌, కేటీఆర్‌ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య తదితరులు తరలివెళ్లారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు.

Exit mobile version