తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధును డిసెంబర్ 28 వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు సీఎం కేసిఆర్. ప్రారంభించిన వారం నుండి పది రోజుల్లో గతంలో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రైతు బంధు అమలు పై రైతులు ఆందోళన చెందనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే.. దళిత బంధు నిధులు విడుదల త్వరలోనే చేయనున్నట్లు ప్రకటించారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు నాలుగు మండలాల పరిధిలో ప్రకటించిన విధంగానే దళితబంధు అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
