Site icon NTV Telugu

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ; సీఎం కేసీఆర్ క్లారిటీ !

తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్‌ ఉప ఎన్నికపై మరియు పార్టీ భవిష్యత్‌ కార్యచరణపై దిశా నిర్దేశం చేశారు కేసీఆర్‌. ప్రతి పక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభతో మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని…ఈ సారి మనం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందని… మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు కేసీఆర్‌. ఇంకా రెండేళ్లు ఉంది కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకుందామని… మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడి పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని..సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు సీఎం కేసీఆర్‌.

Exit mobile version