NTV Telugu Site icon

భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్షలు : జగన్‌

అత్యంత వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఉద్యోగ, వ్యాపారం కోసం ఎక్కడెక్కడో ఉన్న కుటుంబీకులందరూ సంక్రాంతి పండుగకు ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్షలు’ అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.