NTV Telugu Site icon

భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించారు.

భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరిన వారికి సహాయ చర్యలు చేపట్టాలని, అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలతో నిండుకుండల్లా రిజర్వాయర్లు ఉన్నాయని.. ఎప్పటికప్పుడు జలాశయాల్లో నీటి పరిస్థితిని సమీక్షించాలన్నారు.