పాత బైకులు తిరిగి సరికొత్త రూపం దాల్చుకొని భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు, జావా బైకులు భారత్ మార్కెట్లోకి ప్రవేశించి సంచలనం సృష్టించాయి. కాగా, ఇప్పుడు మరో రెట్రో బైక్ భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నది. యెజ్దీ బైక్ భారత్‌లోకి పునఃప్రవేశించబోతున్నది. గతంలో ఈ యెజ్దీ బైక్స్ సౌండ్ లవర్స్‌ను కట్టిపడేసింది. ట్విన్ సైలెన్సర్‌తో ఉండే ఈ బైకులు 1980-90 కాలంలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి కాగా ఇప్పుడు ఈ బైక్స్‌ను మహీంద్రా గ్రూప్ క్లాసిక్ లెజెండ్స్ మరోసారి భారత మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 13 వ తేదీన లాంచ్ చేయబోతున్నారు. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేయనుంది. ఈ బైక్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను జనవరి మొదటి వారంలో వెలువరించే అవకాశం ఉంది.
Read: ఆ చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ఆలోచన లేదు: నరేంద్ర సింగ్ తోమర్
