ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత పాక్, రష్యా, చైనా దేశాలకు చెందిన ఎంబసీలు మినగా మిగతా దేశాలకు చెందిన ఎంబసీలను మూసేసిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్‌లో ప్రజాప్రభుత్వం కుప్పకూలిపోడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని, ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా చైనా ముందుకు వచ్చి 30 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. తొలి విడతగా చైనా ఆఫ్ఘనిస్తాన్‌లోని శరణార్థుల కోసం దుప్పట్లు, జాకెట్లను, ఆహార సామాగ్రిని సరఫరా చేసింది. చైనా నుంచి ఈ సామాగ్రితో కూడిన విమానం కాబూల్‌కు చేరుకున్నది. చైనా అందించిన సహాయానికి తాలిబన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చైనా మిత్రదేశం అని ఆ దేశం అందించిన సహకారం మర్చిపోలేనిదని తాలిబన్ ప్రభుత్వం తెలియజేసింది.
తాలిబన్ ప్రభుత్వానికి చైనా సాయం: కాబూల్‌కు చేరిన భారీ సామాగ్రి…
