Site icon NTV Telugu

డ్రాగ‌న్ దూకుడు: ఒక్క ఏడాదిలో 250 క్షిప‌ణి ప‌రీక్ష‌లు…

మ‌న పొరుగుదేశం చైనా దూకుడు పెంచింది.  సంప్ర‌దాయ‌క సైనిక శ‌క్తిని త‌గ్గించుకుంటూ వ‌చ్చిన‌చైనా ఇప్పుడు అత్యాధునిక ఆయుధాల‌పై దృష్టిసారించింది.  క్షిప‌ణులు, రాకెట్ల‌పై దృష్టి సారించింది.  అణ్వాయుథాలు మోసుకెళ్లే శ‌క్తి గ‌త బ‌ల‌మైన క్షిప‌ణులపై చేనా ప్ర‌యోగాలు చేస్తున్న‌ది.  భార‌త్ స‌రిహ‌ద్దుల్లో నిత్యం ర‌గ‌డ సృష్టిస్తున్న చైనా అటు తైవాన్ ను ఆక్ర‌మించుకోవ‌డానికి ప‌థ‌కాలు ర‌చిస్తోంది.  తైవాన్ సరిహ‌ద్దుల్లో చైనా విమానాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  ఇటీవ‌లే హైప‌ర్ సోనిక్ క్షిప‌ణిని ప్ర‌యోగించి భూమిపై తాము ఎక్క‌డైనా దాడులు చేయ‌గ‌ల‌మ‌ని నిరూపించింది.

Read: 700 ఏళ్లుగా ఆ ఊర్లో వింత ఆచారం… అమ్మాయి కాదు… అబ్బాయి అలా…

మ‌రోవైపు వ‌ర‌స‌గా క్షిప‌ణీ ప‌రీక్ష‌లు చేస్తూ ద‌క్షిణ చైనా స‌ముద్రంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణాన్ని క్రియోట్ చేస్తోంది.  ఇక‌పోతే, 2020 వ సంవ‌త్స‌రంలో చైనా ఏకంగా 250 క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించి స‌క్సెస్ అయింది.  ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించిన దేశంగా చైనా నిలిచింది.  అన్ని దేశాలు క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తుంటే, క‌రోనా కాలంలో చైనా మాత్రం ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకునే ప‌నిలో ప‌డిపోయింది.  

Exit mobile version