ఐపీఎల్ 2021 టైటిల్ ను ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఈ రోజు ఐపీఎల్ 20 21 ఫైనల్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసి ఫాఫ్ డుప్లెసిస్86 పరుగులతో రాణించడం వల్ల నిర్ణిత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల టార్గెట్ తో వచ్చిన కేకేఆర్ జట్టు ఇద్దరు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు గిల్, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. కానీ ఆ తర్వాత ఎవరు రాణించలేదు. అందరూ సింగల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. కానీ చివర్లో శివమ్ మావి(20), లాకీ ఫెర్గూసన్(18) రెండంకెల స్కోర్ ను చేరుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో విజయం సాధించి… ఐపీఎల్ చరిత్రలో నాలుగో టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది టైటిల్ను అందుకోవడంతో ఆ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2021 టైటిల్ చెన్నైదే…
