NTV Telugu Site icon

ఆకివీడు ఫలితాలపై బాబు పోస్ట్ మార్టం

ఇటీవల జరిగిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన అనుభవాలు, ఫలితాలపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాల్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయన్నారు.

గతంలో టీడీపీ నంద్యాల ఉప ఎన్నికలోనూ.. ఆ తర్వాత కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. కానీ ఏడాది తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. అదే తరహాలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినా.. వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. నాయకులు సరిగా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. డూ ఆర్‌ డై అన్నట్టు పని చేసే వారికే భవిష్యత్‌ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిణామం.ఓటీఎస్ పేరుతో పేద ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, డబ్బు, అక్రమ కేసులతో వైసీపీ అప్రజాస్వామికంగా గెలిచిందన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి భవిష్యత్తు వుంటుందన్నారు చంద్రబాబు.