NTV Telugu Site icon

నిరసన దీక్షకు సిద్ధమైన చంద్రబాబు.. రేపు ఉదయమే స్టార్ట్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు.. నిన్న టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. కొన్ని జిల్లా కార్యాలయాలపై కూడా దాడులు జరిగిన నేపథ్యంలో.. 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు టీడీపీ చీఫ్.. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది… టీడీపీ కార్యాలయంలో ధ్వంసమైన వాహనాలు, ఫర్నిచర్ మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నారు చంద్రబాబు.

ఇదిలా వుంటే..టీడీపీ నేత పట్టాభి.. సీఎం వైఎస్‌ జగన్‌పై చేసిన కామెంట్ల తర్వాత.. టీడీపీ హెడ్‌ ఆఫీసుతో పాటు.. కొన్ని జిల్లాల్లోని ఆఫీసులపై కూడా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇక, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. కేంద్ర హోంశాఖ, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు.. ఇంతకంటే దారుణం ఏముంటుంది.. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.