తిరుపతి : వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే… రాయలసీమ జిల్లాలలు అతలాకుతలం అయ్యాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రెండు రోజులుగా కడప, తిరుపతి లోని ముంపు ప్రాంతాలలో పర్యటించానని….చెన్నై వర్షాల ఎఫెక్ట్ కడప,చిత్తురు,అనంతపురం, నెల్లూరుపై పడిందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ సూచనలు చేసినా ఫ్రభుత్వం పట్టించుకోలేదు … వారి అనుభావరాహిత్యం ప్రజలు శాపంగా మారిందని నిప్పులు చెరిగారు.
ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు… అలాంటి అప్పుడే ప్రభుత్వ సమర్ధత తెలుస్తుందని చురకలు అంటించారు. పించా, అన్ననయ్య డ్యాంలో ఈ వరద నీళ్ళు వస్తున్న ప్రజలను అప్రమత్తం చేయలేదని… హూదూద్ తుఫాన్ సమయంలో నేను చేసినా పని చేయాలేక పోయారని తెలిపారు. ప్రజలు బయట ఆర్తనాదాలు చేస్తుంటే… అసెంబ్లీ సీఎం పొగడ్తలు చెప్పించుకుంటున్నారని మండి పడ్డారు. వరదల కారణాలపై న్యాయ విచారణ చేపట్టాలని… తప్పుచేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
