Site icon NTV Telugu

నిబంధ‌న‌లు పాటించ‌కుంటే… నియంత్రించ‌డం క‌ష్టం…

క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో విజృంభిస్తున్న వేళ అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌కుంటే మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయ‌డం సాధ్యం కాద‌ని అన్నారు.  త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల్సిందేన‌ని చెప్పారు.  రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, జ‌న‌వ‌రి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వ‌య‌సున్న‌వారికి వ్యాక్సిన్ అందిస్తున్నందువ‌ల‌న అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించారు.  

Read: న‌యా రికార్డ్‌: 6వేల అడుగుల ఎత్తులో తాడుపై అలా న‌డిచి…

రూపు మార్చుకొని క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్నందువ‌ల‌న జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారుల‌కు షా సూచించారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తోంద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వాల సూచ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌ని, నిబంధ‌న‌లు పాటిస్తేనే క‌రోనాకు చెక్ పెట్ట‌గ‌ల‌మ‌ని షా పేర్కొన్నారు.  వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే ప్ర‌స్తుతానికి ఉన్న ఏకైక మార్గ‌మ‌ని, త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించారు.  

Exit mobile version