ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం… వైఎస్ జగన్‌తో పాటు… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి… అయితే, ఆ ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును ఒకేసారి కామన్ ఆర్డర్‌గా ఇస్తామని.. రెండు పిటిషన్లలోనూ ఒకే రకమైన ఆరోపణలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొంది కోర్టు.. రెండు పిటిషన్లపై ఒకేసారి ఆదేశాలు ఇవ్వటం అనేది సరైన నిర్ణయంగా కోర్టు భావిస్తోంది.. కాగా, వైఎస్ జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారనేది పిటిషనర్ ప్రధానమైన ఆరోపణగా ఉంది.. మరి.. వచ్చే నెల 15వ తేదీన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
వైఎస్ జగన్ బెయిర్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
Show comments