బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని హ్యాపీగా ఉండాల్సిన ఉద్యోగులు అవినీతి బాట పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చివరకు కటకటాల పాలవుతున్నారు. కర్ణాటకలోని కలుబుర్గి జిల్లాకు చెందిన పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఇంజనీర్ శాంతగౌడ బిరదర్ అవినీతి భాగోతం సోషల్ మీడియాకి ఎక్కింది. సంపాదించిన అవినీతి సొమ్ముతో అన్ని హంగులతో ఇంటిని నిర్మించుకున్నాడు.
Read: ఇయర్ ఎండ్ మానియా: భారీగా పెరిగిన విమానం- హోటల్ రూమ్స్ ధరలు…
ఈజీ మనీకి అలవాటుపడిన ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పక్కా సమాచరంతోనే అధికారులు ఈ దాడులు నిర్వహించారు. లెక్కలోకి రాని బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇంటి కోసం నిర్మించిన ప్లాస్టిక్ పైప్‌లైన్లో డబ్బును దాచారని ఏసీబీ అధికారులు గుర్తించి ప్లంబర్‌ను రప్పించి ఆ పైప్‌లైన్లను కట్ చేయించారు. కట్ చేసిన పైప్‌లైన్లలో నుంచి డబ్బుల కట్టలు బయటపడ్డాయి. పైప్‌లైన్లో సుమారు రూ. 25 లక్షలు దాచినట్టు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.