Site icon NTV Telugu

తిరుప‌తిలో మ‌రో టెన్షన్‌… నిన్న వాట‌ర్ ట్యాంక్… నేడు ఇళ్ల‌కు బీట‌లు…

తిరుప‌తిలో ఇటీవ‌లే భారీ వ‌ర్షాలు కురిసిన సంగ‌తి తెలిసిందే.  భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రంలో అనేక ఇబ్బందులు త‌లెత్తుతున్న సంగ‌తి తెలిసిందే.  ఇక తిరుప‌తిలోని కృష్ణాన‌గ‌ర్‌లోని ప్ర‌జ‌లు గ‌త రెండు రోజులుగా భ‌యంతో వ‌ణికిపోతున్నారు.  వ‌ర్షాల త‌రువాత కృష్ణాన‌గ‌ర్‌లోని ఓ మ‌హిళ ఇంట్లోని వాట‌ర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి వ‌చ్చింది.  ఈ సంఘ‌ట‌న త‌రువాత కృష్ణాన‌గ‌ర్‌లోని ప్ర‌జ‌లు కంటిమీద కునుకులేకుండా కాలం గ‌డుపుతున్నారు.  

Read: లైవ్‌: ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్‌

ఎటు నుంచి ప్ర‌మాదం ముంచుకొస్తుందో తెలియ‌క భ‌య‌ప‌డుతున్నారు.  అయితే, వాట‌ర్ ట్యాంక్ ఘ‌ట‌న జ‌రిగిన ప‌రిస‌రాల్లోని 18 ఇళ్లకు హ‌టాత్తుగా బీట‌లు వారాయి.  గోడ‌లు, మెట్లుపై భారీగా ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. దీంతో కృష్ణాన‌గ‌ర్‌లో ఉండాలంటే భ‌యంగా ఉంద‌ని, ఇళ్లు ఎక్క‌డ కూలిపోతాయో అని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు.  రాయ‌ల‌సీమ‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి అని జియాల‌జీ ప్రొఫెస‌ర్స్ బృందం తెలియ‌జేసింది.  

https://youtube.com/watch?v=sxAywFS23jA
Exit mobile version