NTV Telugu Site icon

వైర‌ల్‌: నెటిజన్ల మ‌న‌సు దోచిన దున్న‌పోతు…

అవ‌త‌ల వ్య‌క్తులు ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకోవ‌డం మ‌నిషి నైజం.  అయితే, ఇటీవ‌ల కాలంలో ఆ మాన‌వ‌త్వం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.  మ‌నిషి ఆప‌ద‌లో ఉంటే చూసి చూడ‌న‌ట్టు వెళ్లిపోతారు.  అయితే, జంతువులు అలా కాదు.  ఆప‌ద‌లో ఉంటే వాటికి ర‌క్షించేందుకు వాటికి చేత‌నైన స‌హాయాన్ని చేసేందుకు ముందుకు వ‌స్తాయి.  సాధ్య‌మైనంత వ‌రకు ర‌క్షిస్తాయి.  అడ‌వి జాతికి చెందిన దున్న‌పోతుల‌కు కోసం జాస్తి.  వాటిని మ‌చ్చిక చేసుకోవ‌డం అసాధ్యం.  ఇక అదే జాతికి చెందిన కొన్నింటిని పోటీల‌కోసం వినియోగిస్తుంటారు.  

Read: లైవ్‌: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

ఇలాంటి దున్న‌పోతు దానికంటే చిన్న‌దైన తాబేలును ర‌క్షించింది.  ఇసుక‌లో న‌డుచుకుంటు వ‌స్తున్న తాబేలు హ‌ఠాత్తుగా బోల్లా ప‌డింది.  తిరిగి లేచేందుకు చాలా ప్ర‌య‌త్నం చేసింది.  కానీ వ‌ల్ల‌కాలేదు.  అయితే, అక్క‌డికి వ‌చ్చిన ఓ దున్న‌పోతే త‌న కొమ్ముల స‌హాయంతో తిరిగి నిల‌బ‌డేట్టు చేసింది.  దున్నపోతు చేసిన స‌హాయానికి అక్క‌డే ఉన్న వారంతా ఫిదా అయ్యారు.  ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.