NTV Telugu Site icon

మొన్న చిరు మేన‌ల్లుడుతో… ఇప్పుడు అల్లుడుతో!

Buchibabu to Direct Kalyan Dev Movie

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అయిన సినిమా ఉప్పెన‌. ఈ మూవీతోనే ద‌ర్శ‌కుడిగా సానా బుచ్చిబాబు సైతం ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు. వైష్ణ‌వ్ తేజ్ మ‌రో రెండు మూడు సినిమాల‌తో బిజీ అయిపోయాడు కానీ బుచ్చిబాబు మాత్రం అధికారికంగా ఏ సినిమాకూ క‌మిట్ కాలేదు. ఎన్టీయార్ తో మూవీ చేయాల‌న్న‌ది చిర‌కాల కోరిక అని బుచ్చిబాబు చెబుతున్నాడు కానీ ఇప్ప‌ట్లో ఈ యంగ్ డైరెక్ట‌ర్ కు యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ డే్ట్స్ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రో యేడాది వ‌ర‌కూ ఎన్టీయార్ డేట్స్ దొర‌క‌డం క‌ష్టం కాబ‌ట్టి అప్ప‌టి వర‌కూ ఆగి ఉండ‌కుండా… ఈ లోగా ఒక‌టి, రెండు సినిమాలు బుచ్చిబాబు చేస్తేనే బెట‌ర్ అని స‌న్నిహితులు చెబుతున్నార‌ట‌. దాంతో స్టార్ హీరోల డేట్స్ కోసం ఆగ‌డం కంటే… త‌నంటే అభిమానం ఉన్న యంగ్ హీరోల‌తో సినిమా చేయాల‌ని బుచ్చిబాబు ఫిక్స్ అయిపోయాడ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ తో బుచ్చిబాబు మూవీ చేయ‌బోతున్నాడ‌నే వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇప్ప‌టికే విజేత‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాణ్ దేవ్ ప్ర‌స్తుతం సూప‌ర్ మ‌చ్చి చిత్రంలో న‌టించాడు. అది పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. తాజాగా కిన్నెరసాని అనే చిత్రానికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత బుచ్చిబాబు – క‌ళ్యాణ్ దేవ్ కాంబోలో మూవీ ఉంటుంద‌ని తెలుస్తోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో!